BASANT

HOW TO WAY IN GOD BASANT 200

Saturday, July 13, 2019

KARAMA FALAM కర్మ అంటే ఏమిటి?


కర్మ అంటే ఏమిటి?: వాటిని జయించినప్పుడే...

కుండలిని యోగము యోగ శాస్త్రం లో కుండలి శక్తి అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి అని సవివరము గా విశదీకరించింది. మానవ శరీరంలోవెన్నెముక లో సప్తచక్రాలు ఉంటాయి. కుండలి శక్తిమానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది.
మూలాధారం లో దాగివున్న ఈ కుండలిని శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలిని యోగ. ఈ కుండలిని యోగ ద్వార గతజన్మ పాపా భారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాటే వీలున్నది.
కుండలిని యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలిని శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.శరీరంలోని ప్రాణశక్తి గతి శక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది.యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేయవచ్చు.

అరిషడ్వర్గాలను జయించినప్పుడే...

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కుండలిని శక్తిని జాగృతం చేయడానికి ముందు దేహ శుద్ధి, నాడీ శుద్ధి, మనో శుద్ధి మరియు బుద్ధి శుద్ధి ఎలా జరగాలో బోధిస్తుంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైన ముని ప్రవక్తిమై అనేక రూపాలలో కర్మసిద్ధంతం విసదీకరించారు. కర్మఅంటే మానసికముగా గాని, శారీరకముగాగాని చేసినది.

అవన్నీ కర్మ ఫలాలే

ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా, స్వంతముగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితము విద్యుక్త ధర్మాన్ని వదిలి వేయడం పాపంగానే పరిగణించ బడుతుంన్నది .

కర్మ ఫలం మీద అధికారం లేదు..

కర్మచేయడం మీదే మనుష్యులకు అధికారం ఉంటుంది. కాని కర్మ ఫలం మీద మీకు అధికారం లేదు.అంటే సత్కర్మ లేక పాప కర్మ ఆచరించేది మానవుడే.కనుక గత జన్మలలో చేసిన పాప పుణ్య కర్మలు అనుభవింగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తుంది.కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి.మంచి కర్మలకి మంచి ప్రతిఫలం మరియు చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి! పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ చేసే ప్రతి పని కర్మయే.

కర్మ అంటే ఏమిటి.

నిద్రించడం, శ్వాసించడం, ధ్యానింనించడం, తపస్సు, మౌనం, భుజించడం, ఉపవసించడం కర్మయే. జీవించి ఉన్న ప్రాణి కర్మ చేయకుండా ఉండ లేరు. మనిషి మరణించిన తరువాత కూడా కర్మ అనేది కొనసాగుతుంది. మనిషి మరణించిన తరువాత మరణించిన వ్యక్తి కొరకు అతడి పుత్రులు పుత్ర సమానులు నిర్వహించేవే కర్మకాండలు.పాపం నశించే వరకూ ఆత్మ ప్రయాణం సాగుతుందని ఆ కర్మఫలితమైన పుణ్య పాపాలను అనుభవించడానికి జీవుడు అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాడు.

కర్మ పల్లే పాపపుణ్యాలు

జీవుడు భౌతిక శరీరాన్ని వదిలి పోయే సమయంలో పాపపుణ్యాలను, వాసనలను వెంట తీసుకు వెడాతాడని వివరిస్తుంది. పాపపుణ్యాలు కర్మ చేయడం వలననే సంభవిస్తుంది. అంటే. అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు.లోక హితమును కోరుతూ కర్మలను ఆచరిస్తూ తద్వారా వచ్చే ఫలాన్ని భగవత్ప్రసాదితంగా అనుభవించవచ్చన్నది దీని సారాంశం.

భగవంతుని ఆధీనంలో కర్మఫలం

మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి . భవంతుడిని ధ్యానించి గతజన్మ పాపా భారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాట వీలున్నదని యోగ శాస్త్రం బోధిస్తుంది. మనిషి తన విద్యుక్త కర్మలను నిష్కామముగా చక్కగా ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చన్నది ఆద్యాత్మిక దృష్టితో యోగ శాస్త్రం వివరిస్తుంది. సత్కర్మాచరణ మానవులకు సుఖాన్ని, స్వర్గాన్ని ఇవ్వగలదని దుష్కర్మలు మానవునికి కష్టాలను నరకాన్ని ఇవ్వగలదని యోగ శాస్త్రాలు బోధిస్తుంది.

No comments:

Post a Comment